ఈఎస్‌ఐలో కోట్ల రూపాయల ఔషధాల కొనుగోలు వ్యవహారంలో గోల్మాల్ జరిగిందన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక నేపథ్యంలో అనిశా అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. సికింద్రాబాద్‌లోని ఈఎస్‌ఐ సంచాలకుడి కార్యాలయంలో మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేపట్టారు. ఔషధాల కొనుగోళ్లకు సంబంధించిన దస్త్రాలు ఇతర ఫైల్‌లను పరిశీలించారు. ఇందుకు సంబంధించి సంచాలకుల కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని ప్రశ్నించారు. అనిశా అదనపు ఎస్పీ మధుసూదన్ నేతృత్వంలోని పదిమంది అధికారుల బృందం సోదాలు చేపట్టింది. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వైద్యశాఖ కార్యదర్శి శశాంక్ గోయల్ సంచాలకుల కార్యాలయంలో వైద్యఅధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు.
ఇవీ చూడండి: కుట్రపూరిత విధానాలను ఎండగట్టినట్లయింది..