ETV Bharat / state

తహసీల్దార్​ ఇంట్లో రూ. 93 లక్షలు? - 93 లక్షల రూపాయలు గుర్తించారు

రాష్ట్ర రాజధాని శివారులో అనిశా విస్తృత సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ అధికారిణి ఇంట్లో ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 93 లక్షల రూపాలయలు పట్టుబడ్దాయి. ఇటీవలి కాలంలో ఇంత భారీ ఎత్తున డబ్బు దొరకడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

అధికారిని ఇంట్లో 93 లక్షల నగదు, 43 తులాల బంగారం ఎక్కడివి..?
author img

By

Published : Jul 11, 2019, 5:13 AM IST

Updated : Jul 11, 2019, 7:01 AM IST

హైదరాబాద్​ హయత్​నగర్​లో నివాసం ఉంటున్న కేశంపేట తహసీల్దార్‌ ఇంట్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు 93 లక్షల రూపాయలు గుర్తించారు. భారీ ఎత్తున 2 వేలు, 500 రూపాయల నోట్ల కట్టలు చూసి ఖంగుతిన్నారు. కేశంపేట మండలంలో ఓ రైతు నుంచి 4 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్వో అనంతయ్య ఇచ్చిన సమాచారంతో తహసీల్దార్​ ఇంట్లో సోదాలు చేశారు.

డబ్బులిస్తే తప్ప పని జరగదు

మామిడిపల్లి భాస్కర్‌ అనే రైతు తన 9 ఎకరాల పొలానికి కేటాయించిన సర్వే నంబరు రికార్డుల్లో లేదంటూ కేశంపేట తహసీల్దార్​ను ఆశ్రయించాడు. డబ్బులిస్తే తప్ప పని జరగదంటూ కొందుర్గు అనంతయ్య అనే వ్యక్తి భాస్కర్‌కు సూచించాడు. 8 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. గత నెలలో 30 వేలు బయానాగా తీసుకున్నాడు. ఈ విషయమై భాస్కర్‌ అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు 4లక్షలు ఇస్తానని భాస్కర్ అనంతయ్యకు చెప్పాడు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఓ దుకాణంలో లంచం ఇస్తుండగా... అనిశా అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ లావణ్య ఆదేశాల మేరకే తీసుకున్నట్లు వీఆర్వో తెలిపారు.

93 లక్షలు ఎక్కడివి..?
హైదరాబాద్ హయత్‌నగర్‌లోని తహసీల్దార్ లావణ్య నివాసంలో అనిశా అధికారులు సోదాలు చేపట్టారు. 93లక్షల విలువైన నోట్ల కట్టలు, 43 తులాల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ప్రభుత్వ అధికారిని ఇంత నగదు ఎందుకు ఉంచుకుంది, ఎక్కడి నుంచి వచ్చాయి వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు. లావణ్య 2016 నుంచి కేశంపేట తహసీల్దార్​గా, ఆమె భర్త జీహెచ్​ఎంసీ సూపరింటెండెంట్​గా విధులు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. వీఆర్వో అనంతయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అధికారిని ఇంట్లో 93 లక్షల నగదు, 43 తులాల బంగారం ఎక్కడివి..?

ఇదీ చూడండి : 'లంచాలు ఇచ్చే పనిలేకుండా రెవెన్యూ విధానం'

sample description
Last Updated : Jul 11, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.