ETV Bharat / state

నాంపల్లి ఇంటర్​బోర్డు కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన - తెలంగాణ వార్తలు

నిబంధనలు అతిక్రమించిన కార్పొరేట్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్దకు చేరుకున్న ఏబీవీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

abvp protest infront of inter board office in hyderabad
నాంపల్లి ఇంటర్​బోర్డు కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన
author img

By

Published : Feb 10, 2021, 12:36 PM IST

హైదరాబాద్ నాంపల్లి ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిబంధనలు అతిక్రమించిన కార్పొరేట్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బోర్డు నియమాలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

ఆందోళన కారులను అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ఏబీవీపీ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా.... పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

ఇదీ చదవండి: లైవ్ వీడియో: కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.