ETV Bharat / state

'నోటుకు ఓటు అమ్ముకుంటే అంతే సంగతులు'

రాజకీయాలు వ్యాపారంగా మారాయని.. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆర్​.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలు సంఘటితంగా పోరాడి నియంతృత్వాన్ని అణచివేయాలని కోరారు. ప్రజల భవిష్యత్తంతా ఓటులోనే ఉందని...అలాంటి నిర్ణయాత్మక శక్తిని అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు.

'నోటుకు ఓటు అమ్ముకుంటే అంతే సంగతులు'
author img

By

Published : Apr 4, 2019, 5:48 PM IST

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పారిశ్రామిక వ్యక్తులు, రియల్టర్ల చేతిలోకి వెళ్లాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని బషీర్​ బాగ్ ప్రెస్​ క్లబ్​లో బడుగుల అభ్యున్నతికై పోరాటం అనే అంశంపై సదస్సు జరిగింది. పౌర సమాజం, మేధావి వర్గం, సంఘ సంస్కర్తలు రాజకీయ సంస్కరణలపై శ్రద్ధ చూపాలని కోరారు. లేకుంటే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాలు సంఘటితంగా పోరాటం చేయాలని సూచించారు. ​

'నోటుకు ఓటు అమ్ముకుంటే అంతే సంగతులు'

ఇవీ చూడండి:'తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు'

Hyd_Tg_42_04_R. Krishnaiah On Elections_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పై సంస్కరణలు జరగాలని... అలా జరిగినప్పుడే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయని...రాజకీయాలు పారిశ్రామిక వ్యక్తులు , రియల్టర్లు , నియంతలా చేతిలోకి వెళ్లాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బడుగుల అభ్యున్నతికై పోరాటం అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ...రాజకీయాలు రానురాను బ్రష్టుపట్టాయని విమర్శించారు. భుజ్వా పార్టీలు , భూస్వామ్య పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. పౌర సమాజం , మేధావి వర్గం , సంఘ సంస్కర్తలు రాజకీయ సంస్కరణలపై శ్రద్ధ చూపకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని గుర్తుచేశారు. ఓటు విలువను ప్రజలకు చెప్పే బాధ్యత మేధావి వర్గంపై ఉందని...ఓటుకు రేటు కడుతూ ఆర్థిక నేరస్తులు రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారని మండిపడ్డారు. ఓటు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది ... నోటుకు ఓటును అమ్ముకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు.మేధావులు , యువకులు ప్రేక్షక పాత్ర వహిస్తే భవిష్యత్ తరాలకు మనుగడ ఉండదని ఆయన పేర్కొన్నారు. బడుగు , బలహీనవర్గాల సంఘటితంగా పోరాటం చేస్తే ... రాజ్యాధికారం వాటా దక్కుతుందని ఆయన స్పష్ట చేశారు. బైట్: ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.