LIVE : పెద్దపల్లిలో యువ వికాసం సభ - హాజరైన సీఎం రేవంత్ రెడ్డి​ - CM REVANTH LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2024, 4:55 PM IST

Updated : Dec 4, 2024, 7:34 PM IST

CM Revanth Reddy at Yuva Vikasam Meeting Live : ఏడాది కాలంలో 54 వేల 520 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. టీజీపీఎస్సీ ద్వారా 12 వేల 324 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సర్కారు తెలిపింది. వైద్యారోగ్య నియామక బోర్డు 7 వేల 378, పోలీసు నియామక సంస్థ 16 వేల 67, గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 8 వేల 304 ఉద్యోగాలు భర్తీ చేసిందని ప్రభుత్వం తెలిపింది. డీఎస్సీ ద్వారా 10 వేల 6 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించినట్లు వివరించింది. మరో 441 ఉద్యోగాలు ఇతర సంస్థల ద్వారా నియమించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రూప్-4తో పాటు, సింగరేణి, వైద్యారోగ్య శాఖ ఉద్యోగ నియామక ప్రక్రియలో విజేతలుగా నిలిచిన 9 వేల మందికి ఇవాళ నియామక పత్రాలు ఇస్తున్నారు. ఇవాళ పెద్దపల్లిలో జరుగుతున్న సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉద్యోగపత్రాలను ఇస్తున్నారు. 
Last Updated : Dec 4, 2024, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.