ETV Bharat / technology

ప్రోబా-3లో సాంకేతిక లోపం- చివరి నిమిషంలో మిషన్​ వాయిదా - ISRO POSTPONES PROBA 3 LAUNCH

ప్రోబా-3లో సమస్య- PSLV-C59 ప్రయోగం వాయిదా

ISRO Reschedules Proba-3 Launch
ISRO Reschedules Proba-3 Launch (ISRO)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 4, 2024, 4:41 PM IST

Updated : Dec 4, 2024, 5:13 PM IST

ISRO Postpones PROBA 3 Launch: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోబా-3 మిషన్​ లాంఛింగ్​ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్​ నుంచి బుధవారం సాయంత్రం 4:06 గంటలకు మిషన్​ ప్రయోగించాల్సి ఉంది. అయితే మిషన్​లో సాంకేతిక లోపాల్ని గుర్తించడంతో​ లాస్ట్ మినిట్​లో దీన్ని వాయిదా వేశారు. ఈ మేరకు సాంకేతిక లోపాల కారణంగా ప్రోబా-3 మిషన్​ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.

ఈ మిషన్ ప్రధాన లక్ష్యం?: సూర్యుడి బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేసేందుకు 'పీఎస్‌ఎల్‌వీ-సీ59/ప్రోబా-3' మిషన్​ను చేపట్టారు. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అభివృద్ధి చేసింది. ఈ మిషన్​లో.. కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC), ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) అనే రెండు అంతరిక్ష నౌకలు ఉంటాయి. ఈ రెండింటి బరువు సుమారు 550 కిలోలు. వీటిని 'స్టాక్డ్ కాన్ఫిగరేషన్'లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి లాంఛ్ చేయనున్నారు.

ఈ రెండు శాటిలైట్లను ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా ప్రయోగించనున్నారు. 'ప్రోబా-3' మిషన్​లో భాగంగా 'PSLV-XL' రాకెట్ రెండు ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం ఈ రెండు శాటిలైట్లు పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో సూర్యుని చుట్టూ భూకక్ష్యలో తిరగనున్నాయి.

సాధారణంగా సూర్యుని ప్రచండ వెలుగుల మధ్య కరోనా పొరను గమనించడం చాలా కష్టం. ఎందుకంటే సూర్యుని ప్రకాశం.. కరోనా బ్రైట్ పాయింట్ కంటే మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది టెలిస్కోప్‌ను బ్లైండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యగ్రహణం కోసం పరిస్థితులను సిద్ధం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

ఈ మిషన్​లో భాగంగా ప్రయోగించిన రెండు ఉపగ్రహాల ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించనున్నారు. తద్వారా శాస్త్రవేత్తలు సూర్యుని కరోనా పొరపై లోతైన అధ్యయనం చేయనున్నారు. ఈ అద్భుత ప్రయోగంలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

అయితే చివరి నిమిషంలో మిషన్​లో సాంకేతిక లోపం గుర్తించడంతో శాస్త్రవేత్తలు దీన్ని పోస్ట్​పోన్ చేశారు. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్​డౌన్ ప్రక్రియను కూడా నిలిపివేశారు. మిషన్​లో సమస్యను పరిష్కరించిన తర్వాత తిరిగి ప్రయోగాన్ని రేపు మధ్యాహ్నం 4.12 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది.

"ప్రోబా-3 స్పేస్‌క్రాఫ్ట్ PSLV-C59/PROBA-3 ప్రయోగంలో గుర్తించిన సాంకేతిక లోపాల కారణంగా రేపు 16:12 గంటలకు రీషెడ్యూల్ చేయడం జరిగింది." - ఇస్రో

ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్​డౌన్ స్టార్ట్..!

ఎన్నో రహస్యాలు.. ఛేదించే పనిలో 'ప్రోబా-3'.. ఇది కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఎలా సృష్టిస్తుందో తెలుసా?

Last Updated : Dec 4, 2024, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.