ETV Bharat / state

నూతన మద్యం విధానాలకై ఆబ్కారీ శాఖ కసరత్తు - wine

రాష్ట్రానికి అధికరాబడి తెచ్చే ఆబ్కారీ శాఖ నూతన మద్యం విధానాల రూపకల్పనకై తర్జనభర్జన పడుతోంది. కొత్త మండల కేంద్రాల్లో వందకుపైగా మద్యం దుకాణాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న ఎక్సైజ్​ శాఖ విమర్శలకు తావులేని విధానాలను తీసుకురావాలని యోచిస్తోంది. దుకాణాల వద్ద అనుమతించిన గదులను ఎత్తివేయాలా, ఉంచాలా అన్న మీమాంసతో ఆబ్కారీ అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

అబ్కారీ శాఖ కసరత్తు
author img

By

Published : Aug 6, 2019, 5:13 AM IST

Updated : Aug 6, 2019, 8:02 AM IST

నూతన మద్యం విధానాలకై ఆబ్కారీ శాఖ కసరత్తు

వస్తు సేవల పన్ను తరువాత రాష్ట్ర ఖజానాను నింపేది ఆబ్కారీ శాఖ. ఈ శాఖ ద్వారా 2018-19 ఆర్థిక ఏడాదిలో రూ. 21వేల కోట్లకు పైగా రాబడి వచ్చింది. 2019-20లో అంతకు మించిన ఆదాయం కోసం నూతన మద్యం విధానాలను రూపొందించేందుకు ఎక్సైజ్​ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మందుబాబుల ఆగడాలతో ఇబ్బందులు..

దుకాణాల వద్దనే మందుబాబులు మద్యం సేవించేందుకు వీలుగా... పర్మిట్‌ గదులు ఏర్పాటు చేసుకోడానికి ఆబ్కారీ శాఖ ప్రత్యేక అనుమతులిచ్చింది. లైసెన్స్‌దారులు నిర్ధేశించిన ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం గదులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడే తాగేస్తున్నారు. మత్తులో వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలకు గురవుతున్నారు. దుకాణాల వద్దనే తాగేందుకు అనుమతి ఇవ్వడం వల్ల మద్యం ప్రియుల ఆగడాలు స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి. మహిళలు, పిల్లలు ఆ ప్రాంతంలో సంచరించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.

అనుమతి నిరాకరణ..

ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త మద్యం విధానాల రూపకల్పనలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులు ఏమిటన్న అంశంపై ఎక్సైజ్‌ శాఖ దృష్టి సారిస్తోంది. పర్మిట్‌ గదుల ఏర్పాటుకు అనుమతించకుండా ఉండటమే గాక దుకాణాల్లో విడి విక్రయాలు చేయకుండా చూడాలని యోచిస్తోంది.

రాబడి తగ్గదు..

పర్మిట్‌ గదులు తీసేస్తే ఆదాయం పడిపోతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. జిల్లాల పునర్విభజనలో ఏర్పాటైన నూతన మండల కేంద్రాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే, పర్మిట్‌ గదులకు అనుమతించకపోయినా రాబడి తగ్గకుండా ఉంటుందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఆ ప్రభావం పడకూడదు..

వచ్చే నెల చివరి నాటికి కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దశల వారీగా మద్యపాన నిషేధం విధించేందుకు ఆ ప్రభుత్వం సమాయత్తమవుతున్నందున ఆ ప్రభావం రాష్ట్రంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరు లోపు... ఎక్సైజ్‌ కమిషనర్‌, ఇతర ముఖ్య అధికారులు నూతన విధానంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీచూడండి: '370 రద్దు ఉగ్రవాద విషవృక్షం అంతానికే'

Intro:Body:Conclusion:
Last Updated : Aug 6, 2019, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.