ఈనెల 10న సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేసిన నిందితులను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
అసలు ఏమి జరిగింది
ఈనెల 10న అబిడ్స్ ఛాపెల్ రోడ్డులో ఆటో కోసం ఎదురు చూస్తున్న ఓ బాలికను బహుదూర్పూరాకు చెందిన మహ్మద్ ఆర్బాజుద్దీన్ అనే వ్యక్తి ఇంటి దగ్గర దింపుతానని కార్ ఎక్కించుకున్నాడు. కారు ఎక్కిన తర్వాత తనను పెళ్లిచేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. ఉదయం కాలేజీకి వెళ్లిన బాలిక సాయంత్రమైన ఇంటికి రాకపోవడం వల్ల ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతిని తీసుకెళ్లిన నిందితుడు రోజంతా నగరంలో తిప్పి సాయంత్రం నిజామాబాద్‌కు తీసుకెళ్లి... మళ్లి 11వ తేదీ ఉదయం నగరానికి తీసుకొచ్చాడు. చార్మినార్‌కు చెందిన అతని స్నేహితుడు సయ్యద్ జబెయిర్ను తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి మెదక్ సమీపంలో ఓ పెట్రోల్ బంకులో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం... కానీ!