అదుపుతప్పిన వాహనం
హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ దత్తాత్రేయ నగర్‌కు చెందిన నరేశ్ కుమార్ జైన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె దినజైన్ అబిడ్స్గన్ ఫౌండ్రి లోని రోసరి కాన్వెంట్ హైస్కూల్లో మూడో తరగతి చదువుతోంది. రోజూలాగానే కుమార్తెను తీసుకుని ద్విచక్రవాహనంపై స్కూలులో దించేందుకు బయలుదేరాడు. అబిడ్స్ చాపెల్ రోడ్‌కు వచ్చేసరికి బండి అదుపు తప్పింది. ఓ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్‌ను ఢీ కొంది. ఇద్దరూ కిందపడిపోయారు. వాటర్ ట్యాంక్ వెనుక చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లాయి.
ఘటనా స్థలంలోనే చిన్నారి మృతి చెందింది. తీవ్ర గాయాలైన తండ్రి నరేశ్‌ను కింగ్ కోఠిలోని కామినేని ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం అనంతరం ట్యాంకర్ చోదకుడు వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల తీరు మారదా..?
పాఠశాలలుండే ప్రాంతాల్లో పిల్లలను తీసుకెళ్లే సమయంలో భారీ వాహనాలను ఎలా అనుమతిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగినా... అధికారుల్లో మార్పు రాలేదని మండిపడ్డారు.
ఇవీ చదవండి:బాలుడి మృతి