Duvvada railway station insident: విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఓ యువతి నరకయాతన అనుభవించింది. అన్నవరానికి చెందిన శశికళ (20) దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో ఆమె దువ్వాడ చేరుకుంది. స్టేషన్‌లో రైలు దిగుతున్న క్రమంలో రైలు-ఫ్లాట్‌ఫామ్ మధ్యలో శశికళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల వద్ద ఉండిపోవడంతో తీవ్ర గాయాలతో గగ్గోలు పెట్టింది.
దీంతో రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కున్న చోట ఫ్లాట్‌ఫామ్‌ను కట్ చేశారు. గంటన్నర పాటు శ్రమించి ఆమెను బయటకు తీసి చికిత్స కోసం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది.
ఇవీ చదవండి: