హైదరాబాద్లోని మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో సోమాలియా దేశానికి చెందిన 70 సంవత్సరాల రైతుకు అరుదైన వైద్యం అందించారు. ఏడు నెలల క్రితం దహిర్ అర్ఫా మొహమ్మద్ సోమాలియాలో పొలం పనులకు వెళ్తుండగా.. రెండు ఉగ్రవాదుల ముఠాలు కాల్పులు జరిపాయి. అందులో దహిర్ అర్ఫా మొహమ్మద్ తొడ నుంచి రెండు తూటాలు మూత్రాశయం పిరుదుల నుంచి బయటకి వచ్చాయి. దీంతో మూత్ర ద్వారం పనిచేయకుండా పోయింది.
అతన్ని హైదరాబాద్ తీసుకురావడం వల్ల డాక్టర్ రవి కుమార్ బృందం అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి రోగికి మూత్రనాళంలో ట్యూబులు ఏర్పరిచారు. చికిత్స విజయవంతం అయిన తర్వాత ఆ ట్యూబులను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ప్రశాంతంగా తన దేశానికి తిరిగి వెళ్లవచ్చని మెడికవర్ యూరియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ రవి కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: సమ్మక్క సారలమ్మ చెంతకు కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ