ETV Bharat / state

పోలీస్ చేతిలో లాఠీ బదులు ఇటుక..!

author img

By

Published : Jan 10, 2020, 5:08 PM IST

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులని కొట్టేందుకు ఓ పోలీస్ అధికారి ఇటుక రాయి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులను దాటుకుని రైతులు ముందుకు సాగుతున్న తరుణంలో ఓ పోలీసు అధికారి ఇటుక రాయి తీసుకుని వారిపై దౌర్జన్యానికి వెళ్లారు.

rock
rock
పోలీస్ చేతిలో లాఠీ బదులు ఇటుక..!

రైతుల పాదయాత్రలో ఓ పోలీస్ అధికారి ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యపరచింది. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయల్దేరిన మహిళలు, రైతులను గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అయినా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.

ఈ సమయంలో ఓ పోలీస్ అధికారి ఇటుకను పట్టుకుని ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. లాఠీ పట్టుకోవాల్సిన సమయంలో రాయి తీసుకోవటంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇటుకను కొంత దూరం పట్టుకెళ్లిన తరువాత జనాన్ని, మీడియాను చూసి వదిలేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఇదీ చదవండి:

అరెస్టుల పర్వంతో.. భగ్గుమన్న రాజధాని

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.