Swachh Survekshan: స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా పరిశుభ్రమైన నగరాలే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పురపాలకశాఖ గడువు నిర్దేశించింది. అందులో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనుల విషయంలో మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల సంక్షేమం, వ్యర్థాల నిర్వహణ, ఉత్తమ విధానాలు, స్వచ్ఛ ఛాంపియన్ల గుర్తింపు, స్వచ్ఛ వార్డుల ఎంపిక, కోవిడ్ వ్యాక్సిన్, సఫాయిమిత్ర సురక్ష తదితర 34 కార్యక్రమాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. బస్తీ స్థాయి, పట్టణ స్థాయి కమిటీల సహకారంతో ఈ నెల 15వ తేదీలోపు ఇందుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్...
స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశుభ్రత సర్వే. స్వచ్ఛ భారత్ మిషన్లో దేశ పౌరులను భాగస్వామ్యం చేసేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్రతలో నగరాలు, రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ చొరవ తీసుకున్నారు.
ఇదీ చదవండి: Regularisation of Contract Employees: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం