హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్కు చెందిన ఎండీ. యూసుఫ్ తన కూతురుతో కలిసి పాలు తీసుకురావడానికి జనరల్ స్టోర్కు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో రహదారిపై చైనా మాంజా తగిలి యూసుఫ్ ముఖానికి గాయాలయ్యాయి.
అక్కడే ఉన్న కాలపత్తర్ పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో స్పందించి తనను ఆస్పత్రికి తీసుకెళ్లి, తన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసిన కాలపత్తర్ పోలీసులకు యూసుఫ్ కృతజ్ఞతలు తెలిపారు.