ETV Bharat / state

సిలిండర్​ పేలుడులో గాయపడిన వ్యక్తి మృతి - Cylinder Blast In Telangana

మూడు రోజుల క్రితం సికింద్రాబాద్​లోని వారాసిగూడలో సిలిండర్ పేలుడు ఘటనలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందాడు. అతని భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

A Man Dead With Cylinder Blast In Hyderabad
సిలిండర్​ పేలుడులో గాయపడిన వ్యక్తి మృతి
author img

By

Published : Feb 12, 2020, 4:50 PM IST

సికింద్రాబాద్​లోని వారాసిగూడలో గౌస్, షబానా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. మూడు రోజుల క్రితం తెల్లవారుజామున వీరి ఇంట్లో గ్యాస్​ సిలిండర్​ పేలింది. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులందరికీ గాయాలు కాగా వారిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గౌస్​ చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. భార్య షబానా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకుని పేలుడు సంబంధించిన ఆధారాలు సేకరించింది.

సిలిండర్​ పేలుడులో గాయపడిన వ్యక్తి మృతి

ఇదీ చూడండి: నేడు ఆమ్​ఆద్మీ శాసనసభా పక్షనేత ఎన్నిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.