husband murdered his wife in hyderabad: అనుమానం అనే వైరస్ మనిషిలోకి ప్రవేశిస్తే అది ఇంతింతై ఒక మహా వృక్షంలా పెనవేసుకుపోతుంది. మనిషిని అంతం చేసేదాకా దానికి నిద్రపట్టదు. అనుమానాల వల్లే ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పసి పిల్లలు అనాథలుగా మిగిలిన సంఘటనలెన్నో సమాజంలో ఉన్నాయి. మనసు లోతుల్లో పునాదుల్లా బలంగా పాతుకుపోయిన అనుమానాల కారణంగా నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అనుమానాలతో మనిషిలో మానవత్వం నశించి క్రూర మృగాల్లా మారిపోతున్నారు. వీళ్లు కూడా మనలాంటి సాటి మనుషులేగా అని ఆలోచించకుండా పరిగెత్తించి చంపిన ఘటనలు నిత్యం సమాజంలో జరుగుతున్నాయి. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. అనుమానం కారణంగా కట్టుకున్న భర్తే కాలయముడై ఈ లోకంలో లేకుండా చేశాడు. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో కట్టుకున్నవాడే వెంటపడి దారుణంగా హతమార్చాడు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇదీ జరిగింది: హైదరాబాద్ చందానగర్ పరిధిలోని నల్లగండ్లలో భార్యను ఓ వ్యక్తి అతికిరాతకంగా హతమార్చాడు. అంబికా(26), నరేందర్ అనే దంపతులు తాండూర్‌కు చెందిన వారు. వీరికి 5సంవత్సరాల పాప కూడ ఉంది. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇద్దరు కలిసి ఉండొద్దనుకొని విడిపోయారు. నరేందర్ అంబికాపై అనుమానం పెంచుకున్నాడు. భార్యాభర్తలిద్దరు వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్నారు. నరేందర్ తాండూరులో, అంబికా నల్లగండ్లలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నరేందర్ నల్లగండ్లకు వచ్చాడు. భార్య పనిచేస్తున్న బొటిక్ షాపుకు వచ్చి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడయ్యాడు. మొదటగా రాయితో అంబికా తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా రక్తం కారుతున్నప్పటికీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో నరేందర్ కత్తితో వెంబడించి అతి దారుణంగా ఆమె గొంతుకోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఇంకా మరిన్ని వివరాలు తెలిసేది ఉంది.
"చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎదురుగా స్వహస్ బొటిక్‌లో అంబిక అనే అమ్మాయి పని చేసేది. ఆమె భర్త నరేందర్ మొదటగా ఆమెను రాయితో కొట్టాడు. ఆమె పారిపోతుంటే మెడ మీద పొడిచేసి చంపాడు. ప్రాథమిక వివరాల ప్రకారం భార్యాభర్తలిద్దరికీ ఒకరంటే ఒకరికి పడటం లేదు. అందుకే గత సంవత్సర కాలంగా వీరు విడిపోయి జీవిస్తున్నారు. అయితే అంబిక మీద అనుమానంతో ఆమె భర్త నరేందర్ అతి కిరాతకంగా చంపినట్లు తెలుస్తుంది. వీరిద్దరికి ఒక పాప ఉంది. నరేందర్ హత్య చేస్తుంటే ఆ పాప కళ్లారా చూసింది. అమ్మాయి స్వస్థలం తాండూరు పక్కన గ్రామం అని తెలుస్తుంది"- చందానగర్ సీఐ
ఇవీ చదవండి: