ETV Bharat / state

నకిలీ వీసాల ముఠా గుట్టురట్టు - నకిలీ వీసాల ముఠా గుట్టురట్టు

నకిలీ వీసాలతో గల్ఫ్‌ దేశాలకు పంపే ముఠా గుట్టు రట్టయింది. నేపాల్​కి చెందిన మహిళలను అక్రమంగా గల్ఫ్​ దేశాలకు పంపుతున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. ​

A gang of counterfeit visas in Hyderabad
నకిలీ వీసాల ముఠా గుట్టురట్టు
author img

By

Published : Mar 13, 2020, 6:24 AM IST

నకిలీ వీసాలతో మహిళలను అక్రమంగా గల్ఫ్ దేశాలకు పంపుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలో నరేశ్​, తిరుపతిరెడ్డి అనే యువకులు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత కొంత కాలంగా నకిలీ వీసాలు సృష్టించి నేపాల్​కి చెందిన మహిళలను గల్ఫ్​ దేశాలకు పంపుతున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వెల్లడించారు.

గతంలో నకిలీ ధ్రువపత్రాలతో వీసాలు సృష్టించి 150 మందిని పంపినట్లు తమ విచారణలో తెలిందని పేర్కొన్నారు. నిందితుల నుంచి 7 ఇండియన్‌ పాస్‌పోర్టులు, 2 నేపాల్‌ పాస్‌పోర్టులు, 4 చరవాణిలు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రక్షితామూర్తి తెలిపారు.

నకిలీ వీసాల ముఠా గుట్టురట్టు

ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.