బోగస్ అకాడమీ స్థాపించి ప్రముఖ యునివర్సిటీలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ ఉత్తరమండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పోలీసులు నిందితుడితో పాటు ధ్రువపత్రాలు కొనుగోలు చేసిన మరో ఆరుగురిని అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట్కు చెందిన హస్మతుల్లా హైదరాబాద్లో డిగ్రీ చదివాడు. చార్మినార్ ఒకేషనల్ పేరుతో ఓ బోగస్ కాలేజీని స్థాపించాడు. పలు యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను సొంతంగా తయారు చేసి గుట్టుగా విక్రయిస్తున్నాడు. అవసరాన్ని బట్టి కోర్సుకో రేటు చొప్పున ధర నిర్ణయించి రూ. 50 వేల నుంచి లక్షా ఐదువేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాడు. పట్టుబడిన వారి నుంచి పలు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: నకిలీ వీడియోను వైరల్ చేస్తున్నారు: అబ్దుల్ మోషీ