ETV Bharat / state

దీపాలు వెలిగిస్తున్నావని యువతిపై ఇతర మతం వారు దాడి..!, చిక్కడపల్లి పీఎస్​లో ఫిర్యాదు - hyderabad news update

FAMILY ATTACKED ON YOUNG WOMEN: దీపావళి పండుగ రోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తోన్న యువతిని ఎదురు ఫ్లాట్ వారు అసభ్య పదజాలంతో దూషించారని చిక్కడపల్లి పీఎస్​లో ఫిర్యాదు నమోదైంది. దీపావళి పండుగను కించపరిచే విధంగా వారు వ్యవహరించాలని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న హిందూ ధార్మిక సంస్థలు నిందితులపై కేసు నమోదు చేయాలని ఆందోళన చేపట్టాయి.

FAMILY ATTACKED YOUNG WOMEN
FAMILY ATTACKED YOUNG WOMEN
author img

By

Published : Oct 26, 2022, 7:24 PM IST

FAMILY ATTACKED ON YOUNG WOMEN: దీపావళి పండుగ రోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తోన్న తనను నలుగురు అసభ్య పదజాలంతో దూషించి, దీపాలను కాళ్లతో తన్నారని ఆరోపిస్తూ ఓ మహిళ చిక్కడపల్లి పీఎస్​లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ వి.హెచ్.పి, భజరంగ్​దళ్ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు.

ఈ నెల 24వ తేదీ రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని అర్చన అపార్ట్​మెంట్​లో ఉంటున్న ఓ యువతి దీపావళి పండుగ పురస్కరించుకొని ఇంటిముందు దివ్వెలను వెలిగించారు. ఆ ఫ్లాట్​కు ఎదురుగా ఉన్న శాలిని దేవ్ కృప (63) వెలిగించిన దీపాలను తన్నడంతో పాటు తన పట్ల అసభ్యంగా వ్యవహరించి దుర్భాషలాడారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. శాలిని దేవ్ కృప భర్త జీఏ క్రిస్టఫర్ (68), కుమారులు రాజీవ్ అబ్రహాం (36), అజిత్ ఎబంజర్ (34) దీపావళి పండుగ పై అసభ్యంగా మాట్లాడుతూ తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఘటనపై యువతి సోషల్ మీడియాలో వీడియాలు పోస్ట్ చేయడంతో పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ రవి చారి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్​దళ్, హిందూ జన జాగృతి సమితి తదితర సంస్థలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపాయి. నిందితులపై కేసు నమోదు చేయాలని ఆయా సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.