ఒడిశాకు చెందిన నలీంద్ర 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ అడ్డగుట్టలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. రోజు లాగానే ఆదివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై.. మూడో అంతస్తు నుంచి కిందపడి పోడిపోయాడు.
తోటి కార్మికులు నలీంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. అయితే క్షతగాత్రుని వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని ఉంటే బతికేవాడని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కాగా ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు బాధితులకు నచ్చజెప్పి పంపించేశారు. అయితే మార్గమధ్యలోనే క్షతగాత్రుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు