హైదరాబాద్‌లో నాంపల్లి కేర్ ఆసుపత్రి సమీపంలో డబ్బు, లగేజ్ బ్యాగ్ పోగొట్టుకున్న బాధితుడికి.... నాలుగు గంటల్లోనే అబిడ్స్ పోలీసులు రికవరీ చేసి అందించారు. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సుధాకర్ తన తండ్రికి క్యాన్సర్ చికిత్స నిమిత్తం సోమవారం నగరానికి వచ్చాడు. నాంపల్లిలోని కేర్ ఆసుపత్రి దగ్గర ఆటో దిగుతున్న సమయంలో బ్యాగ్ అందులోనే మరిచిపోయాడు. దిక్కుతోచని స్థితిలో సుధాకర్ స్థానికుల సహకారంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆటో డ్రైవర్ ఆటోలో ఉన్న బ్యాగ్‌ను గుర్తించి కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అందజేశాడు. బ్యాగ్ ఆచూకీని గుర్తించిన అబిడ్స్ పోలీసులు స్వాధీనం చేసుకొని సుధాకర్‌కు అందజేశారు. సమన్వయంతో నాలుగు గంటల్లోనే కేసును చేధించిన సిబ్బంది రామాంజీ నాయక్ , భాస్కర్ , శివ రాజ్‌లను అబిడ్స్ సీఐ రవికుమార్ అభినందించారు.
ఇవీ చూడండి : చెరువులో చేపల కోసం ఆరాటం