హైదరాబాద్ టోలీచౌకీలోని న్యూ మదీనా జూనియర్ కాలేజీలో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఒక్కో పేపర్‌కు ఓ రేటు కేటాయించి వసూలు చేస్తున్నారు. విషయం తెలుకున్న టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. పరీక్షరాసే సమయంలో అందరితోపాటే విద్యార్థులను కూర్చో బెడుతున్నారు. వారికి నకిలీ ఓఎంఆర్ షీట్ ఇస్తున్నారు. ఒరిజినల్ ఓఎంఆర్ షీట్‌ను కాలేజీ యాజమాన్యమే రాయిస్తోంది. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారి తెలిపారు.
ఇవీ చూడండి: ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు