ETV Bharat / state

గ్రేటర్​లో​ ఇకనుంచి 75శాతం సిటీ బస్సు సర్వీసులు

కొవిడ్​ నేపథ్యంలో.. గ్రేటర్​లో తీసుకొచ్చిన 50శాతం సిటీ స‌ర్వీసుల నిబంధనను ర‌వాణాశాఖ కోరిక మేర‌కు ముఖ్యమంత్రి కేసీఆర్​ 75శాతానికి పెంచారు. ఆ మేరకు మంత్రి పువ్వాడ.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

75-percent-of-city-bus-services-run-in-greater-hyderabad-from-now-onwards-says-minister-puvvada
గ్రేటర్​లో​ ఇకనుంచి 75శాతం సిటీ బస్సు సర్వీసులు
author img

By

Published : Jan 22, 2021, 8:38 AM IST

గ్రేటర్​ హైదరాబాద్​లో 75శాతం సిటీ స‌ర్వీసులు న‌డుపుకోవడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపినట్లు ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ వెల్లడించారు. క‌రోనా ప‌రిస్థితుల నుంచి టీఎస్‌ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని వివరించారు. ప్రగ‌తి భ‌వ‌న్‌లో.. సంబంధిత అధికారుల‌తో కలిసి స‌మీక్ష సమావేశం నిర్వహించారు.

సిటీ స‌ర్వీసుల రాక‌పోక‌లు పెర‌గ‌డం ద్వారా ప్రయాణికుల ఇబ్బందులు కొంత మేర తొల‌గిపోనున్నాయన్నారు మంత్రి. త‌ద్వారా సంస్థకూ ప్రయోజ‌నం చేకూరుతుందని వివరించారు. ఆ మేరకు.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఇదీ చదవండి: టీసీ లొల్లి... కరోనా వేళ ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.