హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలో వెళ్లాడు. గత కొన్నాళ్లుగా అబ్దుల్ అజీజ్ అనే 65 ఏళ్ల వృద్ధుడు పక్కింట్లో ఉంటున్న 24 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు.
ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలుపగా... అజీజ్‌ను నిలదీసేందుకు వారి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. అబ్దుల్ అజీజ్ కుటుంబ సభ్యులు యువతి కుటుంబ సభ్యులపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ యువకుడి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పదకొండు రోజుల్లో ఎలా సాధ్యమైంది?