ETV Bharat / state

విషం పెట్టి 60కోతులను చంపేశారు.. గుట్టల నడుమ కుప్పలుగా మృతదేహాలు

గుట్టల మధ్య కుప్పలు కుప్పలుగా నిర్జీవంగా వానరాలు పడి ఉన్నాయి. ఎవరు చంపారో... ఎందుకు చంపారో... తెలియదు కానీ... మూగజీవాలను విషం పెట్టి మరీ.... కర్కషంగా చంపేశారు. విగతజీవులుగా పడి ఉన్న ఆ వానరాలను సంచుల్లో తీసుకొచ్చి... బహిరంగ ప్రదేశాల్లో పడేశారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్​ జిల్లా శనిగపురంలో జరిగింది.

60 monkey dead bodies in shanigapuram
60 monkey dead bodies in shanigapuram
author img

By

Published : Nov 18, 2020, 7:24 AM IST

వానరాలకు విషం పెట్టి చంపి... మృతదేహాలను బహిరంగ ప్రదేశంలో వదిలివెళ్లిన హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారులో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు సుమారు యాభై నుంచి ఆరవై కోతులు చనిపోయి కుప్పలుగా పడి ఉండటాన్ని చూసి స్థానికులు ఆవేదన చెందారు.

పొలం పనులకు వెళ్లే క్రమంలో గుట్టల మధ్య నుంచి వాసన వస్తుండగా.... పరిశీలించిన స్థానికులకు వానరాల మృతదేహాలు కుప్పలుగా పడి ఉండటం కనిపించింది. ఎవరు చంపారో... ఎందుకు చంపారో... ఎక్కడ చంపారో తెలియదు... చనిపోయిన వాటిని మాత్రం సంచుల్లో తీసుకొచ్చి గుట్టల మాటున పడేశారు. ఈ ఘటనతో శనిగపురంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసిన అధికారులు పంచనామా నిర్వహించనున్నారు. వానరాలను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: కారులో ఇరుక్కుని ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.