హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ళు జరిగి నేటికి ఆరేళ్లు పూర్తైన సందర్భంగా ప్రాణాలు కోల్పోయినవారికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవల పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండించిన సుధీర్‌రెడ్డి... త్వరలోనే వారికి బుద్ధి చెప్పాలని ఆకాంక్షించారు.
గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, గోకుల్ చాట్ బాంబు పేళుడు బాధితుడు సయ్యద్ రహీమ్, స్థానికులు కార్యక్రమంలో పాల్గొని బాధితులకు నివాళులర్పించారు.
ఇదీ చదవండి:'కేసరి' గర్జన
జంట పేలుళ్లకు ఆరేళ్లు
హైదరాబాద్ మజిలీలో అదొక మరచిపోని రోజు... నగరం రక్తపు కన్నీరు కార్చిన చీకటి దినం... రాజధాని ఉలిక్కిపడి బావురుమన్న దుర్దినం... ఎందరో అమాయకులు అసువులు బాసిన జంట పేలుళ్ల ఘటనకు అప్పుడే ఆరేళ్లు.
జంట పేలుళ్ల బాధితులకు శ్రద్ధంజలి
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ళు జరిగి నేటికి ఆరేళ్లు పూర్తైన సందర్భంగా ప్రాణాలు కోల్పోయినవారికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవల పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండించిన సుధీర్‌రెడ్డి... త్వరలోనే వారికి బుద్ధి చెప్పాలని ఆకాంక్షించారు.
గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, గోకుల్ చాట్ బాంబు పేళుడు బాధితుడు సయ్యద్ రహీమ్, స్థానికులు కార్యక్రమంలో పాల్గొని బాధితులకు నివాళులర్పించారు.
ఇదీ చదవండి:'కేసరి' గర్జన
Contributor: Anil
Center :Tungaturthi
Dist; Suryapet
అమెరికా లోని ఫ్లోరిడా లో జరిగిన దారుణము
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు యం మండలం రహింఖాన్ పేట గ్రామాం విశాదం లో మునింగింది గత
7సంవత్సరాల క్రితము బ్రతుకు తెరువు కోసం కట్టుకున్న భార్యను కన్న పిల్లలను గ్రామంలో వదిలి అమెరికా కు వెళ్లిన గోవర్ధన్ రెడ్డి , అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్ లో మేనేజర్ గా వర్క్ చేస్తునన్నాడు. స్టోర్ లో ఉండగా దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపగా,గోవర్ధన్ రెడ్డి అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం టివి ద్వార తెలుసుకున్న బంధువులు గ్రామస్తులు శోక సముద్రంలో మునిగారు గోవర్ధన్ రెడ్డి మరణవార్త జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి సంఘటణలు అగ్ర రాజ్యంలో తరచూ జరుగుతున్న అక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తందని ఆవేధన వ్వక్తంచేస్తున్నారు.
గోవర్దన్ రెడ్డి పార్థివ దేహాన్ని ఇండియాకు తెచ్చుట విషయంలో సహాయము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు , గోవర్ధన్ రెడ్డి కి ఇద్దరు అమ్మాయిలు. ఇతని తండ్రి రిటైర్డ్ ఆర్మీ .ఇప్పటి వరకు తల్లిదండ్రులకు గోవర్ధన్ రెడ్డి మరణ వార్తను తెలుపలేదు.