హైదరాబాద్ కొత్తపేటలోని ఓజోన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 5కె నడక కార్యక్రమాన్ని డైరెక్టర్ జలపతిరెడ్డి ప్రారంభించారు. అందరూ ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య భారత్‌ను నిర్మించటమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రపంచ కీళ్లనొప్పుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండిః గొంగళి పురుగులతో కీళ్ల నొప్పులకు మందు!