రాష్ట్రంలో కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 3 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 2,84,074 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 1,527 మంది మృతిచెందారు. మహమ్మారి నుంచి మరో 491 మంది బాధితులు కోలుకున్నారు.
ఇప్పటివరకు 2,75,708 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,839 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,723 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 91 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: ఏమరుపాటు వద్దు... మాస్కే ప్రధానాస్త్రం: సీసీఎంబీ డైరెక్టర్