ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 5,120 కరోనా కేసులు నమోదవ్వగా.. 34 మంది వైరస్‌తో చనిపోయారు. ఏపీలో మెుత్తం కేసుల సంఖ్య 7,34,427కు చేరాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 49,513 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ నుంచి మెుత్తం 6,78,828 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇప్పటివరకు 6,086 మంది మృతి చెందారు.
ఏపీలో 24 గంటల వ్యవధిలో 66,769 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 62,83,009 మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి: గుడ్ న్యూస్: నవంబరులో కోవాగ్జిన్ తుది దశ పరీక్షలు