నాగోల్లోని తెలంగాణ మైనారిటీ బాలికల వసతి గృహంలో 38 మంది విద్యార్థినులు కరోన బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వసతిగృహం 5వ అంతస్తులో ఐసోలోషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. నెగిటివ్ వచ్చిన పిల్లలను... తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్తున్నారు.
పాజిటివ్ నిర్ధరణ జరిగిన విద్యార్థులను డీఎంహెచ్ఓతో పాటు వైద్యసిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కొవిడ్ సోకడానికి గల కారణాలను తెలుసుకుంటున్నామంటున్న మేడ్చల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్, పాఠశాల ప్రిన్సిపాల్ వినీలాతో ఈటీవీ భారత్ ముఖాముఖీ.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 247 కేసులు