ఏపీలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2018కి చేరింది. కొత్తగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 9 చొప్పున కేసులు నిర్థారణ కాగా... అనంతపురం జిల్లాలో 8 పాజిటివ్ కేసులు వచ్చాయి. గుంటూరులో 5, కృష్ణా, విశాఖ జిల్లాల్లో మూడు, నెల్లూరులో ఒకరికి వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 975మంది చికిత్స తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 73 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.
ఇవీ చూడండి: 'రాష్ట్రానికి వస్తున్న వలస కార్మికులపై మరింత నిఘా'