రాష్ట్రంలో కరోనా కేసుల (Ts Corona Cases) నమోదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు కేసుల సంఖ్య పెరుగుతుండగా... మరుసటి రోజు వీటి నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 354 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు.
వైరస్ బారి నుంచి కోలుకున్న మరో 427 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,308 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 74,634 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇదీ చూడండి: KRMB: ఈ నెల 27న కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ.. అజెండాలో కీలకాంశాలు