కళ్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ పథకం అమలు కోసం 350 కోట్ల రూపాయలను బీసీ సంక్షేమ శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు. కళ్యాణలక్ష్మి పథకం కోసం తాజా బడ్జెట్లో 700 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో సగం 350 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి : కొత్త మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం