హైదరాబాద్‌లో 34వ జాతీయ స్థాయి సెయిలింగ్ వీక్ పోటీలను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు హుస్సేన్‌సాగర్ వేదిక కావడం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. గత 33 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోటీల్లో ఈసారి తెలంగాణ నుంచి సెయిలర్స్ చాంపియన్‌గా నిలవాలని గవర్నర్ ఆకాంక్షించారు.
నేటి నుంచి వారం రోజుల పాటు సెయిలింగ్ పోటీలు నగర వాసులకు కనువిందు చేయనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన సెయిలర్స్ ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చనున్నారు. కార్యక్రమంలో ఆర్మీ, నేవీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : హైదరాబాద్ పోలీసుల చెరలో బ్లఫ్‌మాస్టర్