గ్రేటర్ పరిధిలో చెల్లించాల్సిన ఆస్తిపన్ను ఈనెల 30లోగా ఎలాంటి అపరాదరుసుము లేకుండా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి చెల్లించే వారు రెండు శాతం అపరాదరుసుం కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను రూ.1800 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.640 కోట్లు మాత్రమే వసూలైందని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
నగరంలో 15,77,680 మంది ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉండగా... కేవలం 5,69,454 మంది మాత్రమే చెల్లించారన్నారు. ఆస్తిపన్ను ఆయా ఆర్థిక ఏడాది ప్రారంభంలోనే కట్టాల్సిఉన్నప్పటికీ సకాలంలో చెల్లించకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ప్రభావం పడుతోందని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఆదివారాలైన ఈనెల 23, 30 తేదీల్లో కూడా జీహెచ్ఎంసీ సిటీజన్ సర్వీస్ సెంటర్లన్నీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'పెంపు నిర్ణయం మంచిదే... వాళ్లకూ పెంచాలి'