ETV Bharat / state

2BHK Houses in Telangana: ఏళ్లుగా సా..గుతున్న అర్హుల ఎంపిక

2BHK Houses in Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల పథకానికి అవాంతరాలు తొలగిపోవడం లేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవంటూ కొన్నిచోట్ల గుత్తేదారులు స్పందించలేదు.

2BHK
2BHK
author img

By

Published : Mar 3, 2022, 5:18 AM IST

2BHK Houses in Telangana: సొంత గూడు లేని పేదలకు వసతి కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల పథకానికి అవాంతరాలు తొలగిపోవడం లేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవంటూ కొన్నిచోట్ల గుత్తేదారులు స్పందించలేదు. ముందుకు వచ్చినచోట బిల్లుల సమస్యతో పనులు ఆలస్యమయ్యాయి. ఇక ఇళ్లు పూర్తయినచోట లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి రావడం లేదు.

ఏళ్లు గడుస్తున్నా...

ఏళ్లు గడుస్తున్నా అర్హులకు అప్పగించడంలో జాప్యం జరుగుతుండటంతో దరఖాస్తుదారుల్లో అసహనం పెరిగిపోతోంది. కొంతమంది ఇళ్ల తాళాలు పగులగొట్టి మరీ చొరబడుతున్నారు. మొన్న కురవిలో.. తాజాగా మంథనిలో రెండు పడకగదుల ఇళ్లలో ప్రవేశించారు. వారిని ఖాళీ చేయించడానికి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం నానా తిప్పలు పడాల్సివస్తోంది. మంజూరైన ఇళ్లతో పోలిస్తే దరఖాస్తుదారులు పెద్దసంఖ్యలో ఉండటం.. కొన్నిచోట్ల అనర్హులను ఎంపిక చేశారని ఆరోపణలు రావడంతో పథకం అమలులో ఆటంకాలు కలుగుతున్నాయి.

రెండు పడకగదుల ఇళ్లు

లబ్ధిదారులకు ఇచ్చినవి 6 శాతమే!

రాష్ట్రానికి 2.91 లక్షల రెండు పడకగదుల ఇళ్లు మంజూరయ్యాయి. నిర్మాణం పూర్తయినవి, చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలినవి కలిపి 1.82 లక్షల వరకు ఉంటాయని హౌసింగ్‌ కార్పొరేషన్‌ వర్గాల సమాచారం. వీటిలో నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అప్పగించినవి 17 వేలు మాత్రమే. అంటే మంజూరైన ఇళ్లలో దాదాపు 6 శాతమే. 60వేలకు పైగా ఇళ్ల పనులు మొదలే కాలేదు. లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని కేంద్రం అడుగుతోంది. కొన్ని నెలల క్రితమే ఇళ్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణకు నోచుకోలేదు. పూర్తయిన ఇళ్లతో పోలిస్తే దరఖాస్తుదారుల సంఖ్య భారీగా ఉండటం.. ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోవడం.. కొన్నిచోట్ల అవినీతి ఆరోపణలు రావడం ఆలస్యానికి కారణమవుతున్నాయి.

డబుల్ బెడ్​రూం ఇళ్లు

రెండంతస్తుల్లో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ ఇళ్లు మహబూబాబాద్‌ పట్టణంలోనివి. వార్డు కౌన్సిలర్లు చెప్పినట్లే లబ్ధిదారులను ఎంపిక చేసినా.. వారికి తాళాలివ్వలేదు. ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలోని గాంధీనగర్‌లో చేపట్టిన 36 ఇళ్ల నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయి నాలుగేళ్లవుతోంది.

రాష్ట్రంలో కొన్నిచోట్ల ఇదీ పరిస్థితి

* నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో నిర్మిస్తున్న దాదాపు 1200 ఇళ్లలో 500 చివరిదశలో ఉన్నాయి. 400 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి దాదాపు మూడేళ్లవుతోంది. 33 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో పలుమార్లు సర్వేలు చేసి.. 5 వేలకు కుదించారు. యినా లబ్ధిదారుల ఎంపిక కొలిక్కిరాలేదు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్‌లో నిర్మాణం పూర్తయి నాలుగేళ్లవుతున్నా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి.

* సంగారెడ్డి జిల్లాలో 2,355 ఇళ్లు పూర్తి కాగా.. లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతోంది. అందోల్‌ మండలం డాకూరులో 104 ఇళ్లు నిర్మించారు. 500 దరఖాస్తులు రాగా, డ్రా తీసి 120 మందిని ఎంపికచేశారు. దీనిపై ఆరోపణలు రావడంతో మరోసారి ఎంపిక చేసినా లబ్ధిదారులకు ఇళ్లను అందజేయట్లేదు. తెల్లాపూర్‌ పురపాలక సంఘం పరిధిలోని కొల్లూరులో 15,500 ఇళ్లను నిర్మించి ఏడాది దాటినా లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు.

* భూపాలపల్లిలో 544 ఇళ్ల నిర్మాణం 2019లోనే పూర్తయినా లబ్ధిదారుల్ని ఎంపిక చేయలేదు. 60 ఇళ్ల తలుపులు, కిటికీలు చోరీకి గురయ్యాయి. రెండంతస్తుల్లో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ ఇళ్లు మహబూబాబాద్‌ పట్టణంలోనివి. వార్డు కౌన్సిలర్లు చెప్పినట్లే లబ్ధిదారులను ఎంపిక చేసినా.. వారికి తాళాలివ్వలేదు. ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలోని గాంధీనగర్‌లో చేపట్టిన 36 ఇళ్ల నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయి నాలుగేళ్లవుతోంది.

పదేళ్లుగా కష్టాల్లో..

-కొత్తపెల్లి సరోజన, జంగేడు, భూపాలపల్లి జిల్లా

దేళ్ల క్రితం నా భర్త మరణించాడు. కొంతకాలం క్రితం ఇల్లు కూలిపోయింది. చిన్న రేకులషెడ్డు వేసుకుని ముగ్గురు పిల్లలతో ఉంటున్నా. వానాకాలంలో చాలా ఇబ్బందిపడుతున్నాం. ఇప్పటికైనా ఇల్లు కేటాయించాలి.

ఇళ్లు నిర్మించి మూడేళ్లవుతున్నా..

నుమకొండలోని అంబేడ్కర్‌నగర్‌ కాలనీలో పేదల గుడిసెలను ఖాళీ చేయించి.. ఒక్కో బ్లాక్‌లో 16 చొప్పున 37 బ్లాకుల్లో ఇళ్లు నిర్మించి మూడేళ్లవుతున్నా ప్రారంభానికి నోచుకోలేదు. 592 మంది లబ్ధిదారులు తమకు ఇళ్లు ఎప్పుడు అప్పగిస్తారోనని పక్కనే గుడిసెల్లో ఉంటున్న దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇక్కడ కాస్త మెరుగు

నిజామాబాద్‌ జిల్లాలో 9,800 ఇళ్లు మంజూరు చేయగా.. 3వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 2,200 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. మిగతా జిల్లాల కంటే ఇక్కడ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. కామారెడ్డి జిల్లాలో 4069 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా.. బాన్సువాడ నియోజకవర్గంలో 2,400, మిగతా 50 కామారెడ్డి నియోజకవర్గంలో పంపిణీ చేశారు.

రెండు పడకగదుల ఇళ్ల తాళాలు పగలగొట్టిన పేదలు

రెండు పడకగదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నిరసిస్తూ కొందరు పేదలు వాటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ప్రభుత్వం 2018లో పెద్దపల్లి జిల్లా మంథనిలో రూ.4.63 కోట్లతో 92 ఇళ్లు నిర్మించింది. అంతకుముందే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి మంగళవారం అర్ధరాత్రి మంథని పురపాలక సిబ్బంది ఇళ్ల తాళంచెవులు అప్పగించారు. దాదాపు 60 మంది రాత్రే ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో పలువురు స్థానికులు బుధవారం ఉదయం మిగతా ఇళ్ల తాళాలు పగలగొట్టి చొరబడ్డారు. మంథని తహసీల్దార్‌ బండి ప్రకాశ్‌, పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇళ్ల నుంచి పేదలను, లబ్ధిదారులను బయటకు పంపించి తాళాలు వేశారు.

అర్హుల ఎంపిక...

గతంలో ఎంపిక చేసిన జాబితాలో అనర్హులున్నారని, లబ్ధిదారుల జాబితాను తిరిగి రూపొందించాలంటూ మహిళలు ఈ సందర్భంగా ఆందోళనకు దిగారు. ఓ వ్యక్తి పెట్రోల్‌ సీసాతో వచ్చి ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసులు వెళ్లిపోయిన అనంతరం కొందరు లబ్ధిదారులు మళ్లీ ఇళ్లలోకి వెళ్లడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు మళ్లీ వచ్చి వారికి నచ్చజెప్పారు. పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటంతో ఇళ్లను గుత్తేదారు అప్పగించలేదని.. పూర్తయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. పేదలకు న్యాయం చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కొందరు లబ్ధిదారులకు మున్సిపల్‌ సిబ్బంది తాళాలు అప్పగించిన విషయమై తహసీల్దారును వివరణ కోరగా.. ఆ విషయం తమకు తెలియదని, పోలీసుల విచారణలో తేలుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: Plane Tyre Burst: విమానం టైర్​ పంక్చర్​- ప్రయాణికులు దిగి ఏం చేశారంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.