ETV Bharat / state

రిజిస్ట్రేషన్ల ద్వారా 6 రోజుల్లో 200 కోట్ల ఆదాయం - తెలంగాణలో పెరుగుతోన్న రిజిస్ట్రేషన్ల ఆదాయం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేయడం మొదలు పెట్టిన 6 రోజుల్లోనే రూ. 200 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. 50 రోజుల తర్వాత ఈ నెల 11 నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి.

రిజిస్ట్రేషన్ల ద్వారా 6 రోజుల్లో 200 కోట్ల ఆదాయం

author img

By

Published : May 18, 2020, 2:10 PM IST

తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖకు క్రమంగా ఆదాయం పెరుగుతోంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేయడం మొదలు పెట్టిన 6 రోజుల్లోనే రూ. 200 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. లాక్‌ డౌన్‌ సమయంలో ప్రధాన కార్యాలయం పని చేస్తున్నప్పటకీ దాదాపుగా అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేయలేదు. మార్చి 22 నుంచి మే 7 వరకు కేవలం 6,544 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా ప్రభుత్వానికి రూ.27 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది.

ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం వల్ల 50 రోజుల తర్వాత ఈ నెల 11 నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ ముందు అర్ధాంతరంగా నిలచిపోయిన రిజిస్ట్రేషన్లతోపాటు కొత్తగా కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 11 నుంచి 16 వరకు దాదాపు 33 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కావడం వల్ల రూ.91.54 కోట్లు, ఈ స్టాంపుల రెవెన్యూ ద్వారా మరో 108.79 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ రెండింటి ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం.. రెండు వందల కోట్లు అని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఈ లెక్కన చూస్తే లాక్‌డౌన్‌ సమయంలో నెలన్నర రోజుల్లో వచ్చింది కేవలం రూ.27 కోట్లుకాగా ఇప్పుడు ఆరు రోజుల్లో వచ్చిన రెండు వందల కోట్లను రోజువారీ ఆదాయంగా చూస్తే రోజుకు దాదాపు రూ.35 కోట్లుగా రాబడి ఉంది. దీనిని బట్టి రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఘననీయంగా పెరగడంతోపాటు.. రాబడి కూడా క్రమంగా పెరుగుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: కూలీ బతుకు.. అందని మెతుకు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.