జీహెచ్ఎంసీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎన్నికల నోడల్ అధికారి విశ్వజిత్ తెలిపారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు సంబంధించిన లక్షా 70 వేల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించినట్లు చెప్పారు. ఇందులో 17 వేల 566 బ్యానర్లు, 39 వేల 322 పోస్టర్లు, 5 వేల 320 బోర్డులు, 32 వేల 514 ఫ్లెక్సీలు, 75 వేల 582 జెండాలు తొలగించామన్నారు.
ఆదివారం ఒక్క రోజు 21 వేలకు పైగా బ్యానర్లు తీసివేసినట్లు వెల్లడించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు నగరంలో 19 ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయన్న విశ్వజిత్... సర్కిళ్ల వారిగా నిఘా బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఇదీ చూడండి: ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం