హుజూరాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుతో పాటు రూ.5వేలు డీడీ కూడా ఇవ్వాలని... అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణతో కూడిన సభ్యుల బృదం ఇంటర్వ్యూ చేయనుంది. అభ్యర్థుల ముఖాముఖి తర్వాత ఏఐసీసీకి నివేదిక వెళ్తుందని, ఆ తరువాత అభ్యర్థి పేరు ప్రకటిస్తారని వివరించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా.. గడువు ముగిసే సమయానికి మొత్తం 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. పత్తి కృష్ణారెడ్డితోపాటు 11 మంది స్థానికులు, ఏడుగురు స్థానికేతరులు దరఖాస్తు చేసుకున్నట్లు పీసీసీ వివరించింది. అయితే ప్రతి దరఖాస్తుతోపాటు టీపీసీసీలో చెల్లుబాటయ్యేలా ఐదువేల రూపాయల విలువ చేసే డీడీ కూడా జతపరచాలని పీసీసీ స్పష్టం చేసింది.
ఇప్పటికే పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఇచ్చిన నివేదికలో పేర్లున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాజీమంత్రి కొండ సురేఖ, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణలు దరఖాస్తు చేసుకోకపోవడం విశేషం. ఉప ఎన్నికలు ఇప్పట్లో ఉండే అవకాశం లేకపోవడం వల్ల దరఖాస్తుల స్వీకరణ గడువును టీపీసీసీ పెంచే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: PCC MAHESH: 'హుజూరాబాద్ ఎన్నికల కోసం కాంగ్రెస్కు ఐదుగురు అభ్యర్థులు'