రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది. కొత్తగా కొవిడ్‌తో తొమ్మిది మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 438కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 1,281 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు వైరస్ నుంచి 37,666 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 11,155 మంది బాధితులు వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 842 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 132 కేసులొచ్చాయి. మేడ్చల్ జిల్లాలో 96, కరీంనగర్ 73, నల్గొండ 51, వరంగల్ అర్బన్ 38, వరంగల్ రూరల్ 36, నిజామాబాద్ 28, మెదక్ 25, సంగారెడ్డి 24, పెద్దపల్లి 23, ఖమ్మం, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాలో 22 చొప్పున, వనపర్తి 21, సిరిసిల్ల 18, మహబూబ్‌నగర్ 14, నాగర్ కర్నూల్ 14, మహబూబాబాద్11, యాదాద్రి, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో 8 చొప్పున, గద్వాల్ 5, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో 3, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాలో 2 చొప్పున, నిర్మల్, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను లెక్కచేయట్లేదు: రాంచందర్ రావు