ETV Bharat / state

పునరాభివృద్ధి ప్రాజెక్టుకు తెలంగాణలో మరో 14 రైల్వేస్టేషన్ల గుర్తింపు - కొత్తగా 14 రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణ

దేశంలో రైల్వే ప్రైవేటీకరణ తర్వాత రైల్వే శాఖ రైల్వే స్టేషన్లపై దృష్టి సారించింది. స్టేషన్ల ప్రాధాన్యత ఆధారంగా పునరాభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఈ జాబితాలో ఉండగా.. తాజాగా తెలంగాణలోని మరో 14 స్టేషన్లను ఎంపిక చేసింది. స్టేషన్‌ లోపల నిరీక్షణ సముదాయాలు(వెయిటింగ్‌ రూమ్‌లు), రెస్టారెంట్లు, దుకాణాలు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్‌ సహా స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు.

15 railway stations in telangana privatized
పునరాభివృద్ధి ప్రాజెక్టుకు తెలంగాణలో మరో 14 రైల్వేస్టేషన్ల గుర్తింపు
author img

By

Published : Jul 25, 2020, 8:14 AM IST

దేశవ్యాప్తంగా 151 ప్రైవేటు రైళ్లను పట్టాలెక్కించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన రైల్వేశాఖ తదుపరి రైల్వే స్టేషన్లపై దృష్టి సారిస్తోంది. స్టేషన్ల ప్రాధాన్యత ఆధారంగా మూడు దశల్లో ప్రైవేటు సంస్థలతో కలిసి పునరాభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

ఇప్పటికే సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఈ జాబితాలో ఉండగా.. తాజాగా తెలంగాణలోని మరో 14 స్టేషన్లను ఎంపిక చేసింది. సికింద్రాబాద్‌ను మొదటిదశలో చేర్చగా, వరంగల్‌ స్టేషన్‌ తాజాగా ఆ జాబితాలోకి వచ్చింది. కాచిగూడను రెండో దశలో చేర్చారు. ఈ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను ఎలాంటి అవసరాలకూ కేటాయించవద్దంటూ రైల్వేబోర్డు తాజాగా ద.మ.రైల్వేకు స్పష్టం చేసింది.

పెత్తనం అంతా వారిదే

వాణిజ్య ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల పేరుతో రైల్వేశాఖ స్టేషన్ల పునరాభివృద్ధి (రీడెవలప్‌మెంట్‌) ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చింది. దీనికోసం ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ)ని రైల్వేశాఖ ఇప్పటికే ఏర్పాటుచేసింది.

స్టేషన్‌ ప్రాంగణం, చుట్టపక్కల ఖాళీ స్థలాల్లో షాపింగ్‌మాళ్లు, థియేటర్లు వంటివి నిర్మించే దిశగా ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడం దీని లక్ష్యం. స్టేషన్‌ లోపల నిరీక్షణ సముదాయాలు(వెయిటింగ్‌ రూమ్‌లు), రెస్టారెంట్లు, దుకాణాలు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్‌ సహా స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అందులో భాగమే.

అందులో ధరలు, ఛార్జీలపై నిర్ణయం ఆయా సంస్థలదే. ఈ ప్రాజెక్టు అమల్లో కొన్ని మార్పులు చేయాలనీ రైల్వేశాఖ భావిస్తోంది. ముందుగా స్టేషన్లను అభివృద్ధి చేసి, ఆ తర్వాత నిర్వహణను వేలంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ఆలోచననూ చేస్తోంది. రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల ఓ సమావేశంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

జోన్‌లో 56.. తెలంగాణలో 15

ద.మ.రైల్వే పరిధిలో తెలంగాణలో 15, ఏపీలో 32, మహారాష్ట్రలో 6, కర్ణాటకలో మూడు చొప్పున మొత్తం 56 స్టేషన్లను పునరాభివృద్ధి ప్రాజెక్టు కింద గుర్తించారు. తెలంగాణలో సికింద్రాబాద్‌తో పాటు వరంగల్‌, కాచిగూడ, కాజీపేట, ఖమ్మం, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, మహబూబాబాద్‌, బేగంపేట, తాండూరు, వికారాబాద్‌, లింగంపల్లి ఉన్నాయి.

‘మొదటి దశలో ఉన్న సికింద్రాబాద్‌ స్టేషన్‌లో కొంతకాలం క్రితమే ఈ ప్రక్రియ మొదలైంది. అభివృద్ధి పనులకు ఆసక్తి చూపిన నాలుగు సంస్థలు కొన్ని సందేహాలు లెవనెత్తిన నేపథ్యంలో రైల్వే బోర్డు అందుకు అనుగుణంగా టెండరు నిబంధనల్ని మారుస్తోంది. ఇది కొలిక్కి రాగానే పనులు వేగం పుంజుకుంటాయి. తర్వాత దశల వారీగా మిగిలిన వాటి నిర్వహణనూ ప్రైవేటు సంస్థలకు అప్పగించే కసరత్తు ఊపందుకుంటుంది’ అని రైల్వే వర్గాల సమాచారం.

ఇదీ చదవండిః కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.