రాష్ట్రంలో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12 మంది ఈ మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 68,946కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 563కు పెరిగింది. ఇప్పటి వరకు 49,675 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జీ కాగా.. ప్రస్తుతం 18,708 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 11,935 మంది బాధితులు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 391 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 121, కరీంనగర్ జిల్లాలో 101 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72 శాతానికి చేరింది.