ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు రోజంతా టీవీ చూస్తున్నాడని, ఫోన్లో వీడియో గేమ్‌లు ఆడుతున్నాడని చెప్పారు. నిద్రాహారాలు మాని ఆ బాలుడు పొద్దంతా అదే పనిలో ఉండటంతో తల్లిదండ్రులు మందలించి పొలం పనులకు వెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చే సరికి బాలుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టీవీ చూడొద్దన్నందుకు 12ఏళ్ల బాలుడు ఆత్మహత్య
పిల్లలను తల్లిదండ్రులు మందలించడం సహజమే. తల్లిదండ్రులు టీవీ చూడొద్దన్నందుకు వట్టిచెరుకూరులోని ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.