Telangana Omicron Cases: రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. రిస్క్ దేశాల నుంచి నలుగురిలో ఒమిక్రాన్ వేరింయట్ను గుర్తించారు. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన 16 మందిలో ఒమిక్రాన్ గుర్తించగా... మరో ముగ్గురి జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. 12 మందిలో 9 మంది విదేశీయుల కాగా... ముగ్గురు భారతీయులని అధికారులు తెలిపారు. కెన్యా నుంచి వచ్చిన ఆరుగురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించగా... సోమాలియా, యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరేసి వ్యక్తుల్లో ఘనా, టాంజానియా నుంచి వచ్చిన ఒక్కొక్కరిలో ఒమిక్రాన్‌ను గుర్తించారు.
కొత్తగా 185 కేసులు...
Telangana Covid Cases: రాష్ట్రంలో కొత్తగా మరో 185 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరొకరు మృతిచెందారు. కరోనా నుంచి మరో 205 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,761 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ 41,484 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇవీ చూడండి:
- Omicron Cases in Telangana: రాష్ట్రంలో 8కి చేరిన ఒమిక్రాన్ కేసులు
- DH Srinivasa Rao on Omicron: జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కేసులు పెరిగే అవకాశం: డీహెచ్
- Dr Rakesh Mishra on Omicron: 'భారీ సంఖ్యలో కేసులు.. ఒమిక్రాన్ వేరియంట్ తీరే అది..'
- Doctor Sridhar on Omicron Variant: 'ఒమిక్రాన్‌ను నిలువరించాలి లేదంటే మూడో ముప్పు తప్పదు'
- Corona mutations: 'కరోనా మ్యుటేషన్ల వల్లే యాంటీబాడీలూ పని చేయటం లేదు'