కళామందిర్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హోం మంత్రి మహమూద్ అలీ, సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా ఇతరులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు. పేదలకు సేవ చేయడం అంటే దేవుడికి సేవ చేసినట్లేనని వారు అభిప్రాయపడ్డారు. కళామందిర్ ఫౌండేషన్ చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు.
సన్మానం
ఈ కార్యక్రమంలో సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, రాజు కందకూరి, నటుడు ప్రియదర్శి, ఐఏఎస్ అధికారి హరిచందనతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్య కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయా రంగాల్లో పేదలకు సేవలందిస్తున్న....రమేష్ చందర్, సుభాష్, నీలిమా, గౌతమ్‌కుమార్, శివకుమార్ వంటి వారికి సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఇదే వేదికపై 10 మంది చేనేత కార్మికులను సన్మానం చేశారు.
ఇవీ చూడండి: అన్నారం బ్యారెజీకి అమృతధారలు