ETV Bharat / state

LOAN APP: రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. రూ.106 కోట్లు జప్తు - ed seized pcfs company money

LOAN APP: రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. రూ.106 కోట్లు జప్తు

author img

By

Published : Aug 26, 2021, 7:01 PM IST

Updated : Aug 26, 2021, 7:49 PM IST

18:57 August 26

LOAN APP: రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. రూ.106 కోట్లు జప్తు

రుణ యాప్‌ల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఫైనాన్స్​ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్​కు చెందిన రూ.106 కోట్లను జప్తు చేసింది. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా పీసీఎఫ్​ఎస్​ రుణాలిచ్చినట్లు గుర్తించిన ఈడీ.. చైనాకు చెందిన జో యాహుయ్ అధీనంలో ఈ కంపెనీ పని చేస్తున్నట్లు వెల్లడించింది.

బోగస్​ సాఫ్ట్​వేర్ ఎగుమతుల పేరిట పీసీఎఫ్​ఎస్​ విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌కు నిధులు తరలించినట్లు తెలిపింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్​కు చెందిన రూ.106 కోట్ల సొమ్మును జప్తు చేసింది.

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ దృష్టి..

తెలంగాణ, తమిళనాడులో పలువురు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన లోన్​ యాప్​ మోసాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ దృష్టి సారించింది. ప్రజల్ని మోసగించడం, భారీగా డబ్బులు దండుకోవడం, ఆ మొత్తాన్ని అక్రమ మార్గాల్లో చైనా సహా ఇతర దేశాలకు తరలించడంలో ఆన్​లైన్​ బెట్టింగ్​ స్కామ్​, లోన్​ యాప్​లకు సారూప్యత ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన ఫిర్యాదులపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.

సంబంధిత కథనాలు..

దా'రుణ' యాప్​ కేసులో రూ.76 కోట్ల ఆస్తులు సీజ్

లోన్​ యాప్​ మోసాలపై ఈడీ దృష్టి

Last Updated : Aug 26, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.