ఏపీలో 24 గంటల వ్యవధిలో 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి. 74 మంది మృతిచెందారు. మొత్తం బాధితుల సంఖ్య 5,27,512కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 4,634 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 4,25,607 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 97,271 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 71,692 కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,08,762 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.
జిల్లాల వారీగా కరోనా మృతులు...
కడప జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో ఏడుగురు కరోనాతో మృతిచెందారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఏడుగురు చొప్పున కరోనాతో మరణించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున కరోనాతో మృతిచెందారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున కరోనాతో చనిపోయారు. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మృతిచెందారు. విజయనగరం జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు కరోనాతో ప్రాణాలు వదిలారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1399 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 1271, పశ్చినగోదావరి జిల్లాలో 1134, నెల్లూరు జిల్లాలో 949, చిత్తూరు జిల్లాలో 887, అనంతపురం జిల్లాలో 801, కడప జిల్లాలో 785, గుంటూరు జిల్లాలో 707, శ్రీకాకుళం జిల్లాలో 660 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండీ... అంగన్వాడీల రూపురేఖలను మార్చబోతున్నాం: జగన్