ETV Bharat / state

హైదరాబాద్​లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు - SR POLICE

హైదరాబాద్​కు చెందిన ఇద్దరు యువకులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విదేశీ యువతుల్ని వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌.ఆర్‌.నగర్ పోలీసులు ఆయా లాడ్జీలపై దాడి చేసి ముఠా గుట్టు రట్టు చేశారు.

ముఠా గుట్టు రట్టు
author img

By

Published : Apr 2, 2019, 5:12 PM IST

ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్‌ ఎస్‌.ఆర్‌.నగర్ పోలీస్ ఠాణా పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న హైటెక్ ముఠా గుట్టు రట్టైంది. అమీర్‌పేటలోని ఆదిత్య హోటల్​లో నడుస్తోన్న ఈ చీకటి వ్యాపారాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఏడుగురు విదేశీ యువతులతో పాటు నలుగురు విటులు, ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్​లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నగరానికి చెందిన రాహుల్, సూర్య అనే ఇద్దరు వ్యక్తులు విదేశీ యువతులను పడుపు వృత్తిలోకి దించుతున్నారని పోలీసులు వెల్లడించారు. పంజాగుట్టలోని పోలో అనే మరో లాడ్జ్​లో ఉజ్బెకిస్థాన్​కు చెందిన నలుగురు యువతులతో పాటు పశ్చిమబంగా​కు చెందిన మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు రాహుల్, సూర్య పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛన్​: కేటీఆర్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.