ETV Bharat / state

9 సభల్లో కేసీఆర్... రోడ్ షోలతో కేటీఆర్

లక్ష్యసాధన కోసం గులాబీ శ్రేణులు ప్రచార వేగం పెంచాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండగా... అధినేత సుడిగాలి పర్యటనల్లో మునిగిపోయారు. రహదారి ప్రదర్శనల్లో పాల్గొంటూ యువనేత ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

ప్రచారాన్ని షురూ చేసిన తెరాస అధినాయత్వం
author img

By

Published : Mar 30, 2019, 11:18 AM IST

Updated : Mar 30, 2019, 11:25 AM IST

ప్రచారాన్ని షురూ చేసిన తెరాస అధినాయత్వం
పదహారు స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసి దిల్లీలో కీలక పాత్ర పోషించాలన్నదే తెరాస ముందున్న లక్ష్యం. పక్కా ప్రణాళికతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పోలింగ్ పూర్తయ్యేవరకు నియోజకవర్గాల్లోనే ఉండాలన్న అధినేత ఆదేశాలతో... మంత్రులు, శాసనసభ్యులు అభ్యర్థులతో కలిసి స్థానికంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ శుక్రవారమే మలిదశ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సన్నాహక సభలతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్... ఈనెల మొదటి వారంలో ఎన్నికల శంఖారావం పూరించారు.

పక్కా ప్రణాళికతో...

ఎన్నికల ప్రణాళిక విడుదలతో కేటీఆర్ కొన్ని సన్నాహక సభలను రద్దు చేసుకోగా... వెంటనే కేసీఆర్ రంగంలోకి దిగారు. తొలిదశలో భాగంగా కరీంనగర్, నిజామాబాద్ సభల్లో పాల్గొన్నారు. ఆ తరువాత అభ్యర్థుల ఖరారు, నామిషన్ల ప్రక్రియతో కొంత విరామం ఇచ్చారు. తాజాగా మిర్యాలగూడ సభతో శుక్రవారం మలిదశ ప్రచారాన్ని పారంభించారు. అనంతరం జరిగిన ఎల్బీ స్టేడియం సభకు సమయాభావం కారణంగా కేసీఆర్​ హాజరు కాలేదు. ఆదివారం నుంచి ఏప్రిల్ 4వరకు 9 సభల్లో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 27నుంచి కేటీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేసి... రోడ్​ షోలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నేడు మహబూబాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

ఇవీ చూడండి:రాజకీయాల్లో గుణాత్మకమార్పు తెస్తా... ఆశీర్వదించండి!

Last Updated : Mar 30, 2019, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.