సినీనటుడు, నర్సాపురం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి నాగబాబుకు ప్రజలెవరూ ఓటు వేయొద్దని తెలుగు సినీ నటీనటుల సంఘం(మా) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా హైదరాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షునిగా రెండేళ్లు పనిచేసినా... అసోసియేషన్ అభివృద్ధికి ఏం చేయలేదని ఆరోపించారు. నాగబాబును ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గం మురికి కూపంగా తయారవుతుందని హెచ్చరించారు. సరైన నాయకులనే ప్రజలు ఎన్నుకోవాలని శివాజీరాజా కోరారు.
ఇదీ చదవండిః కాంగ్రెస్ శ్రేణుల 'బిర్యానీ ఫైట్'- 9 మంది అరెస్ట్